మరో రెండు రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈరోజు, రేపు
ఈ ప్రభావంతో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో ఒక మోస్తరు వర్షం పడే అవకాశముంది. రేపు, ఎల్లుండి మాత్రం అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.