ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఆందోళన

తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఆందోళనకు దిగారు.

Update: 2021-11-29 08:01 GMT


తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఆందోళనకు దిగారు. ఈరోజు జరిగిన పార్లమెంటు ఉభయ సభల్లో నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగారు. వరిధాన్యాన్ని ఎప్పుడు? ఎంత కొంటారని వెంటనే క్లారిటీ ఇవ్వాలని టీఆర్ఎస్ లోక్ సభ సభ్యులు పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని కె. కేశవరావు అన్నారు.

వరి ధాన్యం కొనుగోలుకు....

యాసంగి వరి ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని కేశవరావు అన్నారు. నాలుగు రోజులు తమ మంత్రులు ఢిల్లీలో ఉన్నా స్పష్టత ఇవ్వలేదని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరిగితే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్పష్టత ఇవ్వకపోతే తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు.


Tags:    

Similar News