ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారు?
చండూరు సభలో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు
చండూరు సభలో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అభద్రతాభావం, అపనమ్మకం కేసీఆర్ లో కన్పించిందన్నారు. ఇప్పుడు ప్రదర్శించిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి వచ్చారో చెప్పాలని కిషన్ రెడ్డిని నిలదీశారు. ఎనిమిదేళ్లలో 32 మంది ఎమ్మెల్యేలను ఏ రకంగా పార్టీలో చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. చివరకు వామపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి చేర్చుకున్నారన్నారు. చివరకు వామపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి చేర్చుకున్నారన్నారు. మునుగోడులో వామపక్ష పార్టీలు టీఆర్ఎస్ కు ఎందుకు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు.
ఫిరాయింపులకు...
నలుగురు హీరోలంటున్న కేసీఆర్ అందులో ముగ్గురు ఏ పార్టీ నుంచి గెలిచారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఫిరాయింపుల మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎఫ్ఐఆర్ లో డబ్బు విషయం ఎందుకు ప్రస్తావించలేదన్నారు. కేసీఆర్ పాత రికార్డులను చండూరు సభలో ప్లే చేశారన్నారు. ఇచ్చిన హామీలు ఏ మాత్రం అమలు చేయకుండా ప్రజల ముందుకు వచ్చారన్నారు. కేసీఆర్ ఓటమిని అంగీకరించారని ఆయన అన్నారు. ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్ అని ఆయన అన్నారు.