కేసీఆర్ ఎటూ రాజీనామా ఇవ్వక తప్పదు

అసెంబ్లీ సమావేశాలను కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడానికే పెట్టినట్లుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు

Update: 2023-02-13 07:04 GMT

అసెంబ్లీ సమావేశాలను కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడానికే పెట్టినట్లుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ను వీరుడు, శూరుడు అని పొగడటానికే పరిమితం చేశారని ఆయన అన్నారు. మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకే అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నారన్నారు. కుటుంబ పాలనపై అసెంబ్లీలో ఎందుకు చర్చ జరగలేదని ఆయన ప్రశ్నించారు. కుటుంబ పాలన పోవాలని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని భావించి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

చర్చకు ఎక్కడికైనా...?
కేసీఆర్ రాజీనామా చేస్తానంటున్నారని, ఎక్కడకు రమ్మంటారో చెప్పాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్‌భవన్ లో ఎటూ కేసీఆర్ రాజీనామా ఇవ్వకతప్పదన్నారు. రాజీనామా చేయడానికి అంత తొందరెందుకు అని ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎందుకు మాట్లాడలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి కల్వకుంట్ల కుటుంబం బాగుపడింది నిజం కాదా? అని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రగతి పై ధైర్యం ఉంటే కేసీఆర్ అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తూ నిందలు వేస్తూ కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మంత్రులు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఎందుకు చర్చ జరగలేదన్నారు.


Tags:    

Similar News