Mlc Elections : ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం... అర్థరాత్రి కి ఫలితం

వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభమయింది.

Update: 2024-06-05 02:54 GMT

వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్  ప్రారంభమయింది.. ఉదయం ఎనిమిది గంటలకు ఈ కౌంటింగ్ ప్రారంభమయింది. నల్లగొండలో ఈ ఓట్ల లెకకింపు జరుగుతుంది. బ్యాలట్ పేపర్ విధానంలో జరిగిన ఈ ఎన్నికల్లో లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది. ఈ ఎన్నిక పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన బ్యాలట్ పత్రాలను సిబ్బంది తొలుత కట్టలుగా కడుతున్నారు.

మధ్యాహ్నం నుంచి...
మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఈరోజు అర్ధరాత్రికి ఫలితం వెలువడే అవకాశముంది. ఈ ఎన్నికలో మొత్తం 52 మంది పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి పోటీ చేశారు. కౌంటింగ్ పకడ్బందీగా చేయడానికి ఏర్పాట్లు చేసిన అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ పూర్తయ్యేంత వరకూ ముగ్గురికి మించి ఒకచోట గుమికూడకూడదని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News