Telangana : డ్రైవింగ్ నేర్చుకుంటూ బ్రేక్‌కు బదులు యాక్సిలేటర్ తొక్కడంతో కారు

కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ బ్రేక్ ను కాలితో తొక్కే బదులు యాక్సిలేటర్ తొక్కడంతో అది నేరుగా కుంటలోకి దూసుకుపోయింది

Update: 2024-10-19 06:25 GMT

కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ బ్రేక్ ను కాలితో తొక్కే బదులు యాక్సిలేటర్ తొక్కడంతో అది నేరుగా కుంటలోకి దూసుకుపోయింది. జనగామ పట్టణంలో ఈ ఘటన జరిగింది. తనకు తెలిసిన వ్యక్తితో కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు ఒక యువకుడు రోడ్డుపైకి వచ్చాడు. అయితే నేర్చుకునే సమయంలో జనగాం పట్టణంలోని బతుకమ్మ కుంట సమీపంలోకి రాగానే బ్రేక్ తొక్కబోయి యాక్సిలేటర్ ను తొక్కడంతో అది వేగంగా బతుకమ్మ కుంటలోకి దూసుకు వెళ్లింది. అయితే అక్కడ నీరు తక్కువగా ఉండటంతో కారు పూర్తిగా మునిగిపోలేదు.

అదుపు తప్పి...?
యాక్సిలేటర్ ను తొక్కడంతో దాని వేగం అందుకోవడంతో డ్రైవింగ్ సీట్ లో ఉన్న యువకుడు కన్ఫ్యూజన్ కు గురై మరింత బలంగా నొక్కాడు. దీంతో కారు అదుపు తప్పి వేగంగా వెళ్లడంతో చెరువులో కారుతో పాటు ఇద్దరు పడిపోయారు. అయితే బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో డోర్లు తెరుచుకోక పోవడంతో వాటిని పగుల కొట్టి ిఇద్దరూ ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనతో డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుండా శిక్షణ పొందిన సంస్థల వద్ద నేర్చుకోవాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News