Taiwan : తైవాన్ లో అగ్ని ప్రమాదం.. 46 మంది మృతి

తైవాన్ లో అగ్ని ప్రమాదం కారణంగా 46 మంది చనిపోయారు. ఒక బహుళ అంతస్తు భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. తైవాన్ లోని కావోష్మాంగ్ నగరంలో 13 [more]

;

Update: 2021-10-15 03:47 GMT

తైవాన్ లో అగ్ని ప్రమాదం కారణంగా 46 మంది చనిపోయారు. ఒక బహుళ అంతస్తు భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. తైవాన్ లోని కావోష్మాంగ్ నగరంలో 13 అంతస్థుల భవనం ఉంది. కింది అంతస్థుల్లో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. పై అంతస్థుల్లో కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఒక్కసారిగా గురువారం తెల్లవారు జామున భవనంలో మంటలు వ్యాపించాయి. దీంతో భవనంలో నివసిస్తున్న ప్రజలు హాహాకారాలు చేసుకుంటూ బయటకు వచ్చారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే…..

కానీ తేరుకునేలోపే 46 మంది మరణించారు. వందకు మందికిపైగానే గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్రిమాపక దళాలు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Tags:    

Similar News