Pawan Kalyan : తిరుపతి ఘటనకు ఆ ముగ్గురే బాధ్యత వహించాలన్న పవన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు;

Update: 2025-01-09 12:58 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవో బాధ్యత వహించాలని అన్నారు. టీటీడీ ఈవో, జేఈవో వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ ముగ్గురు కారణంగా చంద్రబాబుకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పారు. ఆ ముగ్గురు సక్రమంగా వ్యవహరించి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని పవన్ కల్యాణ్ అన్నారు. తప్పు జరిగిందని క్షమించాలని అన్నారు.

తప్పు జరిగింది.. క్షమించండి...
ఇంత మంది ఉండి కూడా ఆరుగురు ప్రాణాలు పోవడం అంటే సరికాదని పవన్ కల్యాణ్ అన్నారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యక్తిగతంగా ఈ ఘటన తనను కలచి వేసిందన్నారు. ఈవో, అడిషనల్ ఈవో బాధ్యత తీసుకోవాలని, ఇది గేమ్ కాదని పవన్ కల్యాణ్ అన్నారు. తొక్కిసలాట జరిగినప్పుడు పోలీసులు కంట్రోల్ చేయలేరా? అని ఆయన ప్రశ్నించారు. జేఈవో వెంకన్న చౌదరి, ఈవో శ్యామలరావు పూర్తిగా విఫలమయ్యారని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News