Gold Price Today : మరోసారి పరుగు ప్రారంభించిన బంగారం...వెండి మాత్రం నేడు?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి;
బంగారం ధరల్లో నిత్యం మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కొత్త ఏడాది వరస షాకులిస్తూ కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త సంవత్సరం ప్రారంభం రోజు నుంచే బంగారం ధరలు పెరిగి అందరినీ నిరాశలోకి నెట్టేశాయి. ఇక గత రెండు రోజులుగా ధరలు కొంత తగ్గుతున్నట్లే కనిపించినా పెద్దగా కొనుగోలు దారులను ఆకట్టుకునే రీతిలో మాత్రం లేదు. అలాగే వెండి ధరలు కూడా పెద్దగా మార్పు లేదు. లక్ష రూపాయలకు చేరువలోనే కిలో వెండి ఉండటంతో కొనుగోలుదారులు ఇంకా తగ్గుతాయోమోనన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేదని మాత్రం మార్కెట్ నిపుణులు ఖచ్చితంగా చెబుతుండటంతో ధరలు మరింత పెరగకముందే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
మైండ్ సెట్ మారకపోవడంతో...
బంగారం, వెండి రెండు వస్తువులకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. కేవలం మన దేశంలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా కొనుగోలుదారులు పెరిగిపోయారు. సమాజం మారుతున్నప్పటికీ బంగారం కొనుగోలు విషయంలో మాత్రం జనాల మైండ్ సెట్ మారడం లేదు. అది ఒక అపురూపమైన వస్తువుగానే చూడటం నేటికీ జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం బంగారానికి ఉన్న విలువ మరే వస్తువుకు ఉండకపోవడం. పది మందిలో తమ గౌరవాన్ని పెంచుకునేందుకు బంగారం ఒక్కటే మార్గమని భావించడంతోనే ఎక్కువ మంది యువత కూడా బంగారం కొనుగోలు వైపు ఆసక్తి చూపుతున్నారు దీనిపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.
స్వల్పంగా పెరిగినా...
నిజానికి బంగారం ధరలు ఈ రేంజ్ లో పెరగడానికి అనేక కారణాలు చెబుతున్నా అందుకు ప్రధాన కారణం కొనుగోలుదారులేనని చెప్పాలి. అవసరం ఉన్నా లేకపోయినా ఎగబడి కొంటుండటంతో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాదికి పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంటుందని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,610 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,210 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 99,900 రూపాయలుగా ఉంది.