ఎండీ సూసైడ్ నోట్ లో వారి పేర్లు

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన చావుకు [more]

Update: 2020-02-04 08:22 GMT

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన చావుకు కారణమైన నలుగురు వ్యక్తుల పేర్లు డైరీలో రాసి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. యాంజల్ కి చెందిన కొత్త కురుమ్మ శివ కుమార్ ర్ (కాంగ్రెస్ పార్టీ నాయకుడు) కరుణ రెడ్డి (హాస్పిటల్ బిల్డింగ్ ఓనర్) కొండల్ రెడ్డి (బిల్డింగ్ ఓనర్ బామ్మర్ది) మెగా రెడ్డి (సరస్వతి నగర్ కాలనీ ప్రెసిడెంట్) ఈ నలుగురు తనను మానసికంగా వేధిస్తున్నారని, వారి వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్లో రాసిన డాక్టర్ అజయ్ హాస్పిటల్ లో తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసిన హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాక్టర్ అజయ్ రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News