బాబు ఉంటే బాగుపడదు

రాష్ట్ర విభజనకు కారణమైన చంద్రబాబు తిరిగి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆళ్లనాని అన్నారు. శాసనమండలి రద్దు అంశంపై జరుగుతున్న చర్చలో ఆళ్ల నాని [more]

Update: 2020-01-27 07:02 GMT

రాష్ట్ర విభజనకు కారణమైన చంద్రబాబు తిరిగి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆళ్లనాని అన్నారు. శాసనమండలి రద్దు అంశంపై జరుగుతున్న చర్చలో ఆళ్ల నాని మాట్లాడారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను ప్యాకేజీ పేరుతో తాకట్టు పెట్టారన్నారు. అమరావతిలో తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకోవడానికే అడ్డుపడుతున్నారన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు అమరావతిలో స్థలాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదని ఆళ్లనాని తెలిపారు. అభివృద్ధి దిశగా జగన్ తన పాలనతో అడుగులు వేస్తుంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా అమరావతి రాజధానిగా పనికి రాదని చెప్పిందన్న విషయాన్ని ఆళ్ల నాని గుర్తు చేశారు. మూడు పంటలు పండే భూములను చంద్రబాబు నాశనం చేశారని ఆళ్లనాని ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాలకు అమరావతిని చంద్రబాబు వాడుకుంటున్నారన్నారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని శాసనమండలి రద్దు నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఆమోదించాలన్నారు. చంద్రబాబు వంటి నేతలు ఉంటే ఈ రాష్ట్రం బాగుపడదని ఆళ్ల నాని అన్నారు.

Tags:    

Similar News