Hyderabad : హైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జంక్షన్ జామ్ అవుతుందిగా

యాచకులు లేని నగరంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది

Update: 2024-12-17 12:11 GMT

యాచకులు లేని నగరంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా పది నగరాలను ఎంపిక చేసింది. అందులో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలున్నాయి. అయితే హైదరాబాద్ నగర వాసులకు యాచకుల బెడద తప్పడం లేదు. నిజానికి కడుపు నింపు కోవడం కోసం యాచనకు దిగితే అందులో తప్పేమీ లేదు. కానీ దానిని వ్యాపారంగా మార్చడంతోనే అసలు సమస్య. చంటిబిడ్డలను ఎండావానలకు హింసిస్తూ, వారిని ఎరగా చూపుతూ బిక్షాటన దిగుతున్న వారిని పునరావాస కేంద్రాలను కేంద్రాలకు తరలించాలని గతంలో హైదరాబాద్ మున్సిపల్ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

వృత్తిగా మలచుకుని...

యాచకులను తప్పుపట్టడం కాదు కానీ, దానిని వృత్తిగా మలచుకునే వారిని నగరం నుంచి దూరంగా ఉంచాలని, పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా అది ఆచరణ సాధ్యం కావడం లేదు. ఇప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దనే యాచకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. యాచక వృత్తి రోజుకు వేల రూపాయల కాసులు కురిపించే బిజినెస్ గా మారింది. కొందరు నగరంలో మాఫియాగా ఏర్పడి యాచకులుగా మార్చి కొందరిని రోడ్డుపైకి పంపుతున్నారని గతంలోనూ పోలీసులు అనేక సార్లు కేసులు నమోదు చేశారు. చిన్నారుల కిడ్నాప్ లు కూడా జరిగేది అందువల్లనేనని పోలీసులు అనేక సార్లు చెప్పారు. వారికి అవసరమైతే భోజనం లేదా ఆహార వస్తువులు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వవద్దని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రచారం చేసినా ప్రయోజనం లేదు.
ఇండోర్ తరహాలో...
ట్రాఫిక్ పోలీసులు కూడా స్వశక్తితో వ్యాపారం చేసుకునే వారిని ట్రాఫిక్ కు అడ్డమనివారిని పక్కకు తప్పిస్తున్నారని కానీ యాచకులను తొలగించే పనికి మాత్రం ఎవరూ పూనుకోవడం లేదు. కరెక్ట్ గా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దనే వీరు వాహనాలను ఆపి చేతులు చాచి ట్రాఫిక్ కు అంతరాయం కల్గిస్తున్నారని గతంలోనూ అనేక ఆరోపణలు వినిపించినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. వారు యాచకులుగా ఉన్నారు కానీ, అందులో కొందరు లక్షాధికారులతో పాటు సొంత భవనాలు కూడా ఉన్నాయన్న కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో యాచకులకు ఆర్థిక సాయం చేస్తే వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తామని అధికారులు తెలిపారు. డబ్బులు ఇచ్చినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ లో కూడా ఇలాంటి చర్యలే చేపట్టాలని కోరుతున్నారు. యాచకులకు ఆహారం, దుస్తులు పంపిణీ చేయడం వరకూ ఓకే కానీ, డబ్బులు మాత్రం ఇవ్వడం వారిని బద్ధకస్తులుగా మార్చడమేనని అంటున్నారు.


Tags:    

Similar News