ఆక్సిజన్ సమస్యను అధిగమిస్తాం

ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అవసరం [more]

Update: 2021-05-13 01:04 GMT

ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అవసరం అధికంగా ఉందని చెప్పారు. ఏపీకి 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని కేంద్రానికి లేఖ రాయడం జరిగిందని ఆళ్ల నాని తెలిపారు. వ్యాక్సినేషన్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్నది అనవసర రాద్ధాంతంగా ఆళ్ల నాని కొట్టిపారేశారు. భారత్ బయోటెక్ నుంచి చంద్రబాబు వ్యాక్సిన్ లు తెప్పించినా తమకు అభ్యంతరం లేదన్నారు. వ్యాక్సిన్ల కేటాయింపు కేంద్రం చేతిలో ఉందన్న విషయాన్ని తెలిసినా చంద్రబాబు పదే పదే వ్యాక్సినేషన్లను తెప్పించడం లేదని అంటున్నారన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆళ్ల నాని తెలిపారు. ఏపీ ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు వ్యాక్సినేషన్ కోసం ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని ఆళ్ల నాని తెలిపారు.

Tags:    

Similar News