స్వర్ణ ప్యాలెస్ కు అనుమతి లేదు.. చర్యలు తప్పవు
రమేష్ ఆసుపత్రికి మాత్రమే కోవిడ్ ట్రీట్ మెంట్ కు అనుమతి ఇచ్చామని, అనుబంధ కోవిడ్ సెంటర్ కు ఎటువంటి పర్మిషన్ లేదని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని [more]
రమేష్ ఆసుపత్రికి మాత్రమే కోవిడ్ ట్రీట్ మెంట్ కు అనుమతి ఇచ్చామని, అనుబంధ కోవిడ్ సెంటర్ కు ఎటువంటి పర్మిషన్ లేదని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని [more]
రమేష్ ఆసుపత్రికి మాత్రమే కోవిడ్ ట్రీట్ మెంట్ కు అనుమతి ఇచ్చామని, అనుబంధ కోవిడ్ సెంటర్ కు ఎటువంటి పర్మిషన్ లేదని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన ప్రమాదంపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని నియమించామని నాని తెలిపారు. ప్రాధమికంగా అందిన సమాచారం ప్రకారం రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని తేలింది. ఈ సంఘటనలో బాధ్యులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని ఆళ్ల నాని చెప్పారు. ఈ ఘటనలో పది మంది మృతి చెందారని ఆళ్లనాని చెప్పారు. ప్రయవేటు ఆసుపత్రులు హోటళ్లలో కోవిడ్ సెంటర్లు నడపటానికి వీలు లేదన్నారు. వారిపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.