Weather Report : ఇటు ఎండ.. అటు వర్షాలు.. ఇదేమి వెదర్ రా నాయనా?

ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు ఎండలు, మరొక వైపు వర్షాలతో విభిన్న వాతావరణం ఏర్పడింది;

Update: 2025-04-04 04:45 GMT
weather, summer, rain, andhra pradesh
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు ఎండలు, మరొక వైపు వర్షాలతో విభిన్న వాతావరణం ఏర్పడింది. రెండు రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకవైపు ఎండల తీవ్రత పెరుగుతుండగా, మరొక వైపు వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఒకవైపు ఉక్కపోత, మరొక వైపు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కొన్నిచోట్ల మాత్రం వడగళ్లు వాన కురుస్తుండగా, మరికొన్ని చోట్ల ఎండలు దంచికొడుతున్నాయి.

అత్యధిక ఉష్ణోగ్రతలు...
అనకాపల్లిలో అత్యధికం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే గుంటూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరొకవైపు రాయలసీమ జిల్లాల్లో మాత్రం పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈరోజు రాయలసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఆరు, విజయనగరం జిల్లాలో ఐదు, పార్వతీపురంమన్యం జిల్లాలో ఏడు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు, తూర్పుగోదావరి జిల్లాలో రెండు మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది.
అప్రమత్తంగా ఉండాల్సిందే....
దీంతో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం విభిన్న పరిస్థితుల్లో ఉంది. వడగళ్ల వాన కురుస్తాయని చెప్పడంతో రైతులు ముందుగా జాగ్రత్త పడాలని ఏపీ విపత్తు నిర్వహణల సంస్థ హెచ్చరించింది. తమ పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. నలభై డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, బయటకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
రాయలసీమలోని లోతట్టు జిల్లాల్లో...
రాయలసీమ లోతట్టు జిల్లాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, సత్య సాయి, అన్నమయ్య జిల్లాల్లో తీవ్ర తుఫానులు సంభవించే సూచనలు ఉన్నాయి. వైఎస్ఆర్ కడప, నంద్యాల, చిత్తూరు పశ్చిమ భాగాల్లో విస్తృతంగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.పల్నాడు, ఎన్‌టీఆర్, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి ఉరుములతో కూడిన వర్షాలు కురియవచ్చు. ఇతర జిల్లాల్లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
రెండు రోజులు పాటు...
రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి మరాత్వాడ, దానిని అనుకుని ఉన్న మధ్యమహారాష్ట్ర ప్రాంతంలో సముద్రమట్టానికి తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడినట్లు వెల్లడించింది. ఈ మేరకు తూర్పు గాలులలో ద్రోణి ఈరోజు దక్షిణ కర్ణాటక నుంచి పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనం మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు కొనసాగనుంది. ఉత్తరాంధ్ర తీరం, దానికి సమీప ప్రాంతాల్లో ఇది ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది.


Tags:    

Similar News