IPL 2025 : టైటాన్స్ దే మళ్లీ గెలుపు... రాజస్థాన్ రాయల్స్ కు అపజయాలు వెంటాడుతున్నాయిగా

అహ్మదాబాద్ లో జరిగిన గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ యాభైఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలయింది.;

Update: 2025-04-10 01:46 GMT
rajasthan royals,  gujarat titans, IPL 2025,  ahmedabad
  • whatsapp icon

రాజస్థాన్ రాయల్స్ కు ఈ సీజన్ లో విజయాలు తక్కువ... అపజయాలు చాలా ఎక్కువగా ఉంది. గత సీజన్ లో దుమ్మురేపిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇదేనా? అన్న అనుమానం అందరిలోనూ కలుగుతుంది. మంచి బ్యాటింగ్, పటిష్టమైన బౌలింగ్ తో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కు ఈ సీజన్ లోఅస్సలు విజయాలు దక్కాలంటే కష్టంగా మారుతుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ కేవలం రెండు మ్యాచ్ లోనే గెలిచింది.మూడు మ్యాచ్ లలో ఓటమిని చవి చూసింది. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ యాభైఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలయింది.

టైటాన్స్ బ్యాటర్లు...
టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ శుభారంభమే చేసింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ ను ఆర్చర్ అవుట్ చేయడంతో తక్కువ పరుగులకే అవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ సాయి సుదర్శన్, బట్లర్ లు ఒక ఉతికి ఉతికారు. బౌలర్లను మార్చి చూసినా ప్రయోజనం లేకపోయింది. సాయి సుదర్శన్ 82 పరుగులు చేశాడు. బట్లర్ 36 పరుగులు చేసి అవుట్ అయినా, తర్వాత షారూఖ్ ఖాన్ కూడా వచ్చి 36 పరుగులు చేయగలిగాడు. రూథర్ ఫర్డ్ ఏడు పరుగులకే అవుటయినా, రాహుల్ తెవాటియా 24 పరుులు, రషీద్ ఖాన్ పన్నెండు పరుగులు చేయడంతో ఇరవై ఓవర్లకు గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేయగలిగింది.
పెద్ద లక్ష్యమేమీ కాకపోయినా...
టీ 20లలో అందులోనూ ఐపీఎల్ లో ఇది పెద్ద లక్ష్యమేమీకాకపోయినా రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు మాత్రం తడబడ్డారు. యశస్వి జైశ్వాల్ ఈ సీజన్ లో పెద్దగా రాణించడం లేదు. ఈ మ్యాచ్ లోనూ ఆరు పరుగులకే వెనుదిరిగాడు.ఇక కెప్టెన్ సంజూ శాంసన్ం 41 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. నితీష్ రాణా ఒక పరుగుకే అవుట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో పడినట్లు అనిపించింది. పరాగ్ కూడా 26 పరుగుల చేసే అవుట్ కావడంతో హెట్ మేయర్ మాత్రం వచ్చి కొంత పరవాలేదనిపించాడు.52 పరుగులు చేశాడు. అప్పటికే ఓవర్లు తక్కువ.. చేయాల్సిన పరుగులు ఎక్కువ కావడంతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి ముందే ఖాయమయి పోయింది. మొత్తం 19.2 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయింది. కేవలం 159 పరుగులు చేసి మరో అపజయాన్ని మూటగట్టుకుంది. వరసగా రాజస్థాన్ రాయల్స్ కు ఓటములు ఎదురు అవుతున్నాయి.


Tags:    

Similar News