Junior Ntr : జూనియర్ ఫ్యాన్స్ కు తీపి కబురు.. మూవీ నుంచి కీలక అప్ డేట్
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది.;

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకుంటుంది. అయితే ఇటీవల మూవీ షూటింగ్ అధికారికంగా ప్రారంభమయినట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. అయితే మరో బిగ్ అప్ డేట్ కూడా వచ్చేసింది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 22వ తేదీ నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నారని నిర్మాతలు ఎక్స్ వేదికగా తెలిపారు.
ఈ నెల 22 నుంచి...
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్ర నిర్మాణాన్ని చేపట్టింది. ఈ నెల 22వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ కీలక సన్నివేశాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సన్నివేశాలు ఎక్కువగా ఫైటింగ్ సీన్స్ ఉండటంతో భారీ సెట్టింగ్ లు వేసి చిత్రీకరణ జరుపుతారని తెలిసింది. యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తారని, అందుకోసం జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటారని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇందుకు సంబంధించి భారీగా యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇందుకోసం ఫైటింగ్ మాస్టర్స్ ఇప్పటికే సీన్స్ కంపోజ్ చేసినట్లు తెలిసింది.
ఫైటింగ్ సీన్స్ లో...
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి భారీ హైప్ ఇప్పటికే ఇండ్రస్ట్రీలో క్రియేట్ అయింది. సినిమాకు సంబంధించి మూవీ పోస్టర్ ను ఇప్పటికీ రిలీజ్ చేసింది. పాన్ ఇండియా మూవీ కావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ సక్సెస్ ఫుల్ దర్శకుడు కావడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ వరసగా పది మూవీలు విజయవంతం కావడంతో ఈ మూవీ కూడా హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు. ఈ మూవీ పూర్తిగా పీరియాడిక్ మాస్ యాక్షన్ మూవీ గా మేకర్స్ ప్రకటించారు. ఎన్టీఆర్ కు హీరోయిన్ గా రుక్మిణీ వసంత్ నటించనున్నారు. మలయాళ నటుడు టొవినో థామస్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండగకు ఈ మూవీ రిలీజ్ కానుంది. జూన్ 9వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటకే మేకర్స్ ప్రకటించారు.