మేయర్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ.. కుదరదంటున్న మేయర్

కాకినాడ మేయర్ సుంకర పావనిని పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం గెజిట్ ను విడుదల చేసింది. కాకినాడ మేయర్ సుంకర పావనిపై అవిశ్వాసం నెగ్గడంతో ఈ గెజిట్ [more]

;

Update: 2021-10-13 06:08 GMT

కాకినాడ మేయర్ సుంకర పావనిని పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం గెజిట్ ను విడుదల చేసింది. కాకినాడ మేయర్ సుంకర పావనిపై అవిశ్వాసం నెగ్గడంతో ఈ గెజిట్ విడుదల చేసింది. టీడీపీకి చెందిన సుంకర పావనికి వ్యతిరేకంగా అదే పార్టీకి చెందిన కార్పొరేటర్లు వ్యతిరేకించారు. దీంతో సుంకర పావనిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే అవిశ్వాస తీర్మానం ఓటింగ్ ఫలితాలను ఈ నెల 22వ తేదీ వరకూ ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. కానీ ప్రభుత్వం తనను తొలగిస్తూ గెజిట్ విడుదల చేయడంపై సుంకర పావని అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం థిక్కరించినట్లే అవుతుందని సుంకర పావని పేర్కొన్నారు.

Tags:    

Similar News