కేసీఆర్ తో గొడవ పడం.. నీటిని సద్వినియోగం చేసుకునేందుకే?

రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే జీవో నెంబరు 203 విడుదల చేశామని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా ప్రకారమే నీళ్ల పంపకం [more]

Update: 2020-05-12 04:39 GMT

రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే జీవో నెంబరు 203 విడుదల చేశామని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా ప్రకారమే నీళ్ల పంపకం ఉంటుందన్నారు. ఈ ఏడాది 803 క్యూసెక్కుల నీరు వరద పాలయిందన్నారు. పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడాన్ని అనిల్ కుమార్ యాదవ్ సమర్థించారు. వరద నీటిని సద్వినయోగం చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ఇందులో తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లబోదని ఆయన తెలిపారు. వివాదాలకు తాము అవకాశం ఇవ్వమని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. పొరుగు రాష్ట్రం తెలంగాణతో సఖ్యతతోనే వెళతామని ఆయన అన్నారు.

Tags:    

Similar News