అజారుద్దీన్ పై సభ్యుల ఆగ్రహం
ఉప్పల్ స్టేడియంలో జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాస అయింది. అధ్యక్షుడు అజారుద్దీన్ మాట హెచ్.సి.ఏ. క్లబ్ కార్యదర్శులు వినలేదు. వార్షిక సర్వసభ్య సమావేశంకి 186 మంది క్లబ్ [more]
ఉప్పల్ స్టేడియంలో జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాస అయింది. అధ్యక్షుడు అజారుద్దీన్ మాట హెచ్.సి.ఏ. క్లబ్ కార్యదర్శులు వినలేదు. వార్షిక సర్వసభ్య సమావేశంకి 186 మంది క్లబ్ [more]
ఉప్పల్ స్టేడియంలో జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాస అయింది. అధ్యక్షుడు అజారుద్దీన్ మాట హెచ్.సి.ఏ. క్లబ్ కార్యదర్శులు వినలేదు. వార్షిక సర్వసభ్య సమావేశంకి 186 మంది క్లబ్ సెక్రేటరీలు హాజరయ్యారు. హెచ్.సీ.ఏ.లో జరుగుతున్న అవినీతి, ప్లేయర్ల సెలక్షన్స్ పై వస్తున్న ఆరోపణలు, జిల్లాలలో క్రికెట్ అభివృద్ధి వంటి అంశాలపై అధ్యక్ష, కార్యదర్శీలను ప్రశ్నించారు. ఉప్పల్ స్టేడియంలో సర్వసభ్య సమావేశం నుండి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు మధ్యలోనే వెళ్లిపోయారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతితో భ్రష్టు పట్టిపోయిందని, జిల్లాలో క్రికెట్ అభివృద్ధి ధ్యాసే లేదని చెప్పారు. తెలంగాణలోని ఒక్క జిల్లాలోనూ గ్రౌండ్, స్టేడియం లేదని వి.హనుమంతరావు తెలిపారు.