Rain Alert : నేడు ఏపీలో వర్షం పడే ప్రాంతాలివే
ఆంధ్రప్రదేశ్ ను వర్షం వదలడం లేదు. మూడు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ను వర్షం వదలడం లేదు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉరుములు, మెరుపులతో....
కొన్ని చోట్ల మోస్తరు గాను, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇంకొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వాగులు వంకలు దాటే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అదే సమయంలో పిడుగులు పడే అవకాశముందని, పొలాల్లో పశువుల కాపర్లు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఎక్కడెక్కడంటే?
ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తాలో ఈరోజు మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశముందని తెలిపింది. రైతులు తమ పంట ఉత్పత్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రాయలసీమలోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. సో.. బీ అలెర్ట్.