మంత్రుల‌తో క‌లిసి భోంచేసిన చంద్ర‌బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్యాబినెట్ భేటీ మ‌రి కొద్దిసేప‌ట్లో ప్రారంభం కానుంది. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రులు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, పితాని స‌త్య‌నారాయ‌ణ‌ మిన‌హా మిగ‌తా మంత్రులంతా ఇప్ప‌టికే అమ‌రావ‌తి [more]

;

Update: 2019-05-14 09:14 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్యాబినెట్ భేటీ మ‌రి కొద్దిసేప‌ట్లో ప్రారంభం కానుంది. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రులు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, పితాని స‌త్య‌నారాయ‌ణ‌ మిన‌హా మిగ‌తా మంత్రులంతా ఇప్ప‌టికే అమ‌రావ‌తి చేరుకున్నారు. మంత్రివ‌ర్గ స‌మావేశానికి ముందు చంద్ర‌బాబు పార్టీ ముఖ్యులు, మంత్రుల‌తో మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చించారు. ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో మ‌హానాడు ఎన్ని రోజుల పాటు జ‌ర‌పాల‌ని చంద్ర‌బాబు నేత‌ల సూచ‌న‌లు తీసుకున్నారు. త‌ర్వాత మంత్రుల‌తో క‌లిసి చంద్ర‌బాబు భోజ‌నం చేశారు. ఈ ప్ర‌భుత్వంలో ఇదే చివ‌రి క్యాబినెట్ స‌మావేశం. రాష్ట్రంలో కరువు, ఫాని తుఫాను ప్రభావం వంటి అంశాల‌పై క్యాబినెట్ లో చ‌ర్చించ‌నున్నారు. అయితే, క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణ‌యాలను విలేఖ‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి చెప్ప‌వ‌ద్ద‌ని ఎన్నిక‌ల సంఘం సూచించింది.

Tags:    

Similar News