పొలిటిక‌ల్ గేమ్ ప్లే చేసిన చంద్ర‌బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న రాజ‌కీయ చాణ‌క్యంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు ప్ర‌య‌త్నించారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం నిన్న కేసీఆర్ చెన్నై [more]

;

Update: 2019-05-14 11:01 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న రాజ‌కీయ చాణ‌క్యంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు ప్ర‌య‌త్నించారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం నిన్న కేసీఆర్ చెన్నై వెళ్లి డీఎంకే చీఫ్ స్టాలిన్ తో భేటీ అయ్యారు. ఫ్రంట్ విష‌య‌మై ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే, ఇవాళ అనూహ్యంగా డీఎంకే కోశాధికారి, ఎమ్మెల్యే దురై మురుగ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌చ్చి అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు నాయుడును క‌లిశారు. కేసీఆర్ – స్టాలిన్ భేటీ, చ‌ర్చించిన అంశాల‌ను దురై మురుగ‌న్ చంద్ర‌బాబు దృష్టికి తీసుకువ‌చ్చిన‌ట్లుగా టీడీపీ అనుకూల మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దీని ద్వారా కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌వ‌ని, కేసీఆర్ కంటే త‌న ప‌లుకుబ‌డి ఎక్కువ అని చూపించే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు చేసిన‌ట్లు క‌నిపిస్తోంది.

Tags:    

Similar News