జగన్ కు ఒక్క సెకన్ కూడా సీఎంగా ఉండే అర్హత లేదు

జగన్ కు ముఖ్యమంత్రి గా ఒక్క సెకన్ కూడా కొనసాగే అర్హత లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతికి రాకుండా ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని [more]

;

Update: 2021-04-16 02:13 GMT

జగన్ కు ముఖ్యమంత్రి గా ఒక్క సెకన్ కూడా కొనసాగే అర్హత లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతికి రాకుండా ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే తాడేపల్లి నివాసంలో జగన్ 144వ సెక్షన్ మధ్య సేదతీరుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రజలను పట్టించుకోవడం మానేసిన ఈ ముఖ్యమంత్రి ఒక్క సెకన్ కూడా కుర్చీలో ఉండటానికి వీలులేదన్నారు. తిరుపతి ఓటర్లు విజ్ఞులని, వారు సరైన తీర్పు ఇస్తారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News