రీపోలింగ్ జరపాల్సిందే.. నిఘా ఎక్కడ?

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అన్ని పార్టీలూ ఒకవైపు వైసీపీ ఒకవైపు ఉందన్నారు. తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ [more]

;

Update: 2021-04-17 08:29 GMT

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అన్ని పార్టీలూ ఒకవైపు వైసీపీ ఒకవైపు ఉందన్నారు. తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి జనాలను తీసుకువచ్చి ఎవరు ఇష్టమొచ్చినట్లు వాళ్లు ఓట్లేస్తామంటే ఇక ఎన్నికలు ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్ తిరుపతిలో ఎలా పెడతారన్నారు. తిరుపతి చుట్టూ చెక్ పోస్టులు పెట్టి నిఘా ఉంచాల్సిన పోలీసులు చూసీ చూడనట్లు వదిలేశారన్నారు. కేంద్ర బలగాల పహారాలో తిరుపతిలో రీపోలింగ్ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News