జగన్ రెడ్డి జలగలా తయారయ్యారు

జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండి పడ్డారు. ఆయన తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగన్ చేతిలో అధికారం రావడంతోనే రాష్ట్రం సర్వనాశనం [more]

;

Update: 2021-04-15 01:22 GMT

జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండి పడ్డారు. ఆయన తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగన్ చేతిలో అధికారం రావడంతోనే రాష్ట్రం సర్వనాశనం అయిందన్నారు. చివరకు కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలోనూ మద్యం దుకాణాలను తెరిచే ఉంచారని చంద్రబాటు అన్నారు. జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. తన కేసుల కోసమే జగన్ ప్రత్యేక హోదాను పక్కన పెట్టారని చంద్రబాబు అన్నారు. హోదా కోసం పట్టుబడితే జైలు కెళతానని జగన్ కు భయం పట్టుకుందన్నారు. పనబాక లక్ష్మిని గెలిపించి జగన్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు చంద్రబాబు.

Tags:    

Similar News