ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కరోనా తీవ్రరూపం

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కరోనా తీవ్ర రూపం దాల్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు [more]

;

Update: 2021-04-20 01:07 GMT

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కరోనా తీవ్ర రూపం దాల్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు కోరారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నిర్వహించిన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని చంద్రబాబు కోరారు. కరోనా కేసుల నమోదులో దేశంలోనే ఏపీ ఐదో స్థానంలో ఉందని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం సరైన ప్రణాళికతో వెళ్లకపోవడం వల్లనే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు

Tags:    

Similar News