సంగం డెయిరీని ఎలా స్వాధీనం చేసుకుంటారు?

న్యాయస్థానాల్లో ఉండగా సంగం డెయిరీని ప్రభుత్వ పరం ఎలా చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సంగం డెయిరీపై ఇరవై ఏళ్ల క్రితమే వైఎస్ రాజశేఖర్ [more]

;

Update: 2021-04-29 01:20 GMT

న్యాయస్థానాల్లో ఉండగా సంగం డెయిరీని ప్రభుత్వ పరం ఎలా చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సంగం డెయిరీపై ఇరవై ఏళ్ల క్రితమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుట్రకు తెరలేపారని అన్నారు. ఈ డెయిరీపై వైఎస్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు సంగం డెయిరీని ప్రారంభించారని చంద్రబాబు అన్నారు. సంగం డెయిరీని నిర్వీర్యం చేయాలనే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారని అన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర ఛైర్మన్ కాకముందే భూ బదలాయింపు జరిగిందని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News