గల్ఫ్ కారిడార్ లో బీజేపీ ప్రభావాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ వ్యూహం

గల్ప్‌ కార్మికుల సమస్యలపై అవగాహన కలిగి, మంచి ఫాలోయింగ్ ఉన్న తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి సేవలను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ ఎన్నారై విభాగంలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించిన ఆయనతో పలువురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల అనుచరులు, ముఖ్య నాయకులు టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ లో చేరే విషయం గురించి దేవేందర్ రెడ్డిని ఆయన సన్నిహితులు ఆరా తీయగా, ఈ పరిస్థిలో తాను ఎటూ తేల్చుకోలేక పోతున్నానని తన అభిమానులు కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారట.

Update: 2024-04-10 04:21 GMT

గల్ఫ్ కారిడార్ లో బీజేపీ ప్రభావాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ వ్యూహం 

◉ కాంగ్రెస్ లోకి గల్ఫ్ ఎన్నారై నంగి దేవేందర్ రెడ్డి?

◉ ప్రవాసులను దేశభక్తితో ఆకర్షిస్తున్న బీజేపీకి చెక్ పెడుతున్న కాంగ్రెస్ 

గల్ప్‌ కార్మికుల సమస్యలపై అవగాహన కలిగి, మంచి ఫాలోయింగ్ ఉన్న తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి సేవలను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ ఎన్నారై విభాగంలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించిన ఆయనతో పలువురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల అనుచరులు, ముఖ్య నాయకులు టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ లో చేరే విషయం గురించి దేవేందర్ రెడ్డిని ఆయన సన్నిహితులు ఆరా తీయగా, ఈ పరిస్థిలో తాను ఎటూ తేల్చుకోలేక పోతున్నానని తన అభిమానులు కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారట. 

పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గాలలో అత్యధిక గల్ఫ్ వలసలు ఉన్నాయి. పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, వరంగల్ పార్లమెంటు స్థానాలలో ఒక మోస్తరు గల్ఫ్ వలసలు ఉన్నాయి. అభ్యర్థుల గెలుపు ఓటములతో గల్ఫ్ కుటుంబాల పాత్ర కీలకం కానుంది. 

జాతీయవాదం, దేశభక్తి, మాతృభూమి అనే ప్రచారంతో బీజేపీకి గల్ఫ్ ప్రవాసులలో కొంత మొగ్గు ఉన్నది. ఇటీవల నంగి దేవేందర్ రెడ్డి వివిధ సందర్భాలలో గల్ఫ్ లో ఉన్న కార్మికులతో, గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చిన వారితో కలిసిన సందర్బంగా జరిగిన చర్చలో ఆసక్తికరమైన విషయాలు, పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం అయినందున ఆయన పునరాలోచనలో పడినట్లు తెలిసింది. కరోనా సందర్భంగా గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వాపస్ వచ్చిన పేద కార్మికుల నుంచి వందే భారత్ ప్లయిట్స్,  చార్టర్డ్ ఫ్లయిట్స్ లలో రెండింతలు, మూడింతలు విమాన ఛార్జీలు వసూలు చేసిన మోదీకి తాము ఎందుకు మద్దతు ఇవ్వాలని గల్ఫ్ వాపసీలు దేవేందర్ రెడ్డిని ప్రశ్నించడంతో ఆయన మనస్తాపం చెందినట్లు తెలుస్తున్నది. 

దుబాయి, హైదరాబాద్ లలో వ్యాపారాలు కలిగి గల్ఫ్ కార్మికులతో మంచి సంబంధాలు కలిగిన నంగి దేవేందర్ రెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబి పర్యటనలో కీలకంగా వ్యవహరించారు. బీజేపీ కి విదేశాలలో అనుబంధంగా పనిచేసే ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐపిఎఫ్), ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఓఐ) ల కార్యకలాపాల పట్ల మంచి అవగాహన ఉన్న దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే బీజేపీ గల్ఫ్ ఓటు బ్యాంకు పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags:    

Similar News