ఈవీఎంను హ్యాక్ చేయడానికి 53 కోట్ల రూపాయల డీల్

భారతదేశంలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే సమయంలో

Update: 2024-11-15 01:52 GMT

భారతదేశంలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే సమయంలో ఈవీఎంలకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈవీఎంల హ్యాకింగ్ కు సంబంధించిన వాదనలు జరుగుతూనే ఉంటాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందంటూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఇక మహారాష్ట్రలో అతి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండగా.. ఈవీఎం హ్యాకింగ్ చేయగలమంటూ 'ఇండియా టుడే' టీవీకి చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో కొందరు చర్చలు జరిపారు.

నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, ఇండియా టుడే టీవీ ప్రత్యేక దర్యాప్తు బృందం ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చని పలు సందర్భాల్లో ఆరోపించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజాతో సంప్రదింపులు జరిపారు.2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ యంత్రాల్లో అవకతవకలు జరిగాయని సయ్యద్ ఇంతకు ముందే ఆరోపించారు. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ సాంకేతికతను ఉపయోగించి EVMలను హ్యాక్ చేయగలనని షుజా తెలిపారు. మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (MVA) నుండి ఒక సీనియర్ నాయకుడిని సంప్రదించినట్లు కూడా వెల్లడించారు. ఇండియా టుడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఒకరు ఎంపీకి వ్యక్తిగత సహాయకుడిగా నటిస్తూ, ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా లేదా అనే అంశంపై షుజాను వీడియో కాల్ ద్వారా సంప్రదించారు.
గణితంలో పీహెచ్‌డీ చేశానని చెప్పుకునే షుజా ఈ పనులు చేయడం కోసం రూ. 53 కోట్లు డిమాండ్ చేశాడు. ప్రాంతాలను బట్టి EVM సిగ్నల్‌లను మార్చడానికి నిర్దిష్ట అప్లికేషన్‌లను ఉపయోగిస్తామని, ఫ్రీక్వెన్సీ ఐసోలేషన్‌తో తాము అనుకున్న పనిని చేస్తామని వివరించాడు. అయితే, ఈ క్లెయిమ్‌లు పూర్తిగా అవాస్తవం, ఎలాంటి సాంకేతిక ఆధారం లేదని తెలుస్తోంది.


Tags:    

Similar News