Operation Bear Claw: ఎలుగుబంటిలా నటిస్తూ కార్ల మీద దాడులు చేస్తారు.. ఎందుకో తెలుసా?
అయితే ఈ దాడులు జరుపుతోంది కేవలం
అడవుల్లాంటి ప్రాంతాలలో వెళుతున్నప్పుడు కొన్ని జంతువులు దాడులు చేయడం సర్వ సాధారణమే. అయితే కొన్ని లగ్జరీ వాహనాలపై ఎలుగుబంటి దాడి చేయడం వెనుక ఓ పెద్ద స్కామ్ ఉందని తెలుసుకుని అమెరికా అధికారులు షాక్ అయ్యారు. ఎలుగుబంటిలా కాస్ట్యూమ్ ధరించి లగ్జరీ వాహనాల మీద దాడులు చేసినట్లుగా నమ్మించే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ దాడులు జరుపుతోంది కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మాత్రమేనట.
భారీగా భీమా డబ్బులను పొందడం కోసం లగ్జరీ వాహనాలపై నకిలీ ఎలుగుబంటి దాడులను నిర్వహించడానికి, ఎలుగుబంటి కాస్ట్యూమ్ లను వాడిన నలుగురు దక్షిణ కాలిఫోర్నియా నివాసితులు అరెస్టు అయ్యారు. కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ (CDI) "ఆపరేషన్ బేర్ క్లా" అనే పేరుతో దర్యాప్తు చేపట్టింది. రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెజ్ కార్లను ఎలుగుబంటి ధ్వంసం చేసినట్లు ఓ స్టేజ్ ఫుటేజీని సమర్పించినట్లు విచారణలో వెల్లడైంది. బీమా కంపెనీలను 141,839 అమెరికన్ డాలర్ల మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని కనుగొన్నారు.
నిందితులు-రూబెన్ టామ్రాజియన్, 26; అరరత్ చిర్కినియన్, 39, వాహే మురద్ఖాన్యన్, 32, అల్ఫియా జుకర్‌మాన్, 39 లుగా గుర్తించారు. జనవరి 28, 2024న లేక్ ఆరోహెడ్ సమీపంలో రోల్స్ రాయిస్ పై ఎలుగుబంటి దాడి చేసిందని వాహనం ఇంటీరియర్ కు కూడా చాలా నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కు సమర్పించిన సీసీటీవీ ఫుటేజీలో ఎలుగుబంటి కారుపై దాడి చేస్తున్నట్లు కనిపించిందని CDI నివేదించింది. కానీ వీడియోను నిశితంగా పరిశీలించిన తర్వాత, దర్యాప్తులో ఎలుగుబంటి కాస్ట్యూమ్ లో ఓ వ్యక్తి ఉన్నారని నిర్ధారించింది. అంతకు ముందు కూడా మూడు ప్రాంతాల్లో ఇలాంటి దాడులే జరిగాయని, తమ వాహనాలకు భారీగా నష్టం వాటిల్లిందని పలువురు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించారని విచారణలో తేలింది. దీంతో అధికారులు ఈ మోసగాళ్లపై సంబంధిత సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.