డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తులకు శుభవార్త!

డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తులకు ఓ శుభవార్త. వాళ్లు కూడా ఇతరుల్లానే అన్నం తినొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. డయాబెటిక్‌ పేషెంట్లు రైస్‌ తక్కువ తినాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు.

Update: 2023-12-29 05:02 GMT

 Diabetic patients

షుగర్‌ ఉన్నా అన్నం తినొచ్చు

డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తులకు ఓ శుభవార్త. వాళ్లు కూడా ఇతరుల్లానే అన్నం తినొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. డయాబెటిక్‌ పేషెంట్లు రైస్‌ తక్కువ తినాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. అన్నంలో కార్పొహైడ్రేట్లు ఎక్కువ ఉంటాయి. అవి రక్తంలో షుగర్‌ స్థాయిలను పెంచుతాంయి. అందుకే పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలని పేషెంట్లు కూడా భావిస్తారు. మన దేశంలో అన్నం ప్రధాన ఆహారం. దక్షిణాదిలో మొదట్నుంచీ అన్నాన్నే ఎక్కువ తింటారు. డయాబెటిస్‌ వచ్చిన తర్వాత సడెన్‌గా అన్నం తగ్గించమంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి సమస్య తీర్చడానికి జరిగే పరిశోధనలు ఆశావహంగా ఉన్నాయి.

ఎలాంటి అన్నం తినాలి.. అనే విషయాన్ని కూడా పరిశోధకులు చెప్పారు. అన్నం వండిన వెంటనే తినకూడదు. దానిని చల్లార్చి 24 గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత మరోసారి వేడి చేసుకుని తినాలి. దీనివల్ల అన్నంలో పిండి పదార్ధాల ప్రభావం తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. పారిస్‌లో ఓ మెడికల్‌ సైన్సెస్‌ సంస్థ నిర్వహించిన పరిశోధన ప్రకారం నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలో, 24 గంటలు ఉంచిన అన్నాన్ని తిన్న వారిలో షుగర్‌ స్థాయిలు పెరగలేదని తేలింది. ఈ సర్వే పరిమిత సంఖ్యలో రోగుల మీదే జరిగింది. ఫలితాలు మాత్రం ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ విషయాన్ని న్యూట్రిషన్‌ అండ్‌ డయాబెటిస్‌ జర్నల్‌ ప్రచురించింది. దీని మీది పెద్ద సంఖ్యలో రోగుల మీద, పూర్తిస్థాయి పరిశోధనలు జరగాల్సి ఉంది. 

Tags:    

Similar News