సమ్మె విరమణ దిశగానే.... ఈరోజు మరోసారి?

ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి

Update: 2022-02-05 01:07 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విరమణ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. నిన్న రాత్రి 6.30 గంటలకు ప్రారంభమయిన చర్చలు అర్థరాత్రి ఒంటి గంట వరకూ జరిగాయి. ఉద్యోగ సంఘాలు ఉంచిన అనేక డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సీసీఏ కొనసాగింపు, హెచ్ఆర్ఏ పాత శ్లాబులను కొనసాగించడం, ఫిట్ మెంట్ విషయంలోనూ కొంత సర్దుబాటు చేసేందుకు మంత్రుల కమిటీ సానుకూలత చూపించింది.

అన్ని డిమాండ్లకు....
పెన్షనర్లకు అదనపు క్వాంటం పింఛను వంటి అంశాలపై ప్రభుత్వం అనుకూలంగా స్పందించింది. ఒక్క అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను మాత్రం ముఖ్యమంత్రి జగన్ తో చర్చించి చెబుతామన్నారు. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించినా మరికొంత స్పష్టత రావాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈరోజో మరోసారి సమావేశమై చర్చలు జరుపుతామని చెప్పారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఉద్యోగ సంఘాలు ఉంచిన అనేక డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగానే ఉండటంతో సమ్మెను విరమించే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.


Tags:    

Similar News