Prabhas : ది రాజాసాబ్ అప్ డేట్ వచ్చేసిందోచ్.. డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు వరసగా శుభవార్తలు అందుతున్నాయి;

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు వరసగా శుభవార్తలు అందుతున్నాయి. డార్లింగ్ నటిస్తున్న ఏ సినిమాకు సంబంధించిన చిన్న అప్ డేట్ వచ్చినా అదిఫ్యాన్స్ కు నిజమైన పండగ రోజు. డార్లింగ్ ప్రభాస్ కు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు చిత్ర పరిశ్రమలో పనిచేసే వారి దగ్గర నుంచి టాలీవుడ్ నుంచి బాలివుడ్ వరకూ అగ్ర హీరోలు కూడా ప్రభాస్ ను విపరీతంగా ప్రేమిస్తారు. ప్రభాస్ యాటిట్యూడ్ అలా ఉంటుంది మరి. చిన్న వారి నుంచి పెద్ద వారి వరకూ గౌరవం ఇచ్చే తీరు కూడా ఆయన ఎత్తుకంటే మరింత హైట్ కు వెళ్లిపోయింది.
ఎంతో ఆసక్తి...
ప్రభాస్ అంటేనే అంత క్రేజ్ భోజనాల నుంచి సినిమాలో ఆయన ఇచ్చే ఆఫర్ల వరకూ చెప్పుకుని మరీ మురిసిపోని వారు ఉండరంటే నిజం. మురిసిపోవడం కాదు... ప్రభాస్ అంటే వీర భక్తిని ప్రదర్శిస్తారు చాలా మంది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ అప్ డేట్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ది రాజాసాబ్ కు మారుతి దర్శకత్వం వహిస్తుండగా, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుండటంతో ఈ చిత్రానికి ముందే హైప్ క్రియేట్ అయింది.
తాజా అప్ డేట్...
మూవీ దర్శకుడు మారుతి ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్ డేట్ ఇచ్చారు. కొంత డబ్బింగ్ పార్ట, పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, మిగిలిన మూవీ మొత్తం పూర్తయిందని మారుతి తెలిపారు. సీజీ వర్క్స్ కూడా త్వరలోనే కంప్లీట్ అవుతాయని, సాంగ్స్ షూటింగ్స్ అయిపోయిన వెంటనే ఒక్కొక్కొటిగా విడుదల చేస్తామని మారుతి చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ గుండెల్లో చిరుజల్లులు కురిపించారు మారుతి. అనుకున్న సమయానికి కొంత ఆలస్యమయినా త్వరలోనే ఈ చిత్రం విడుదల చేస్తామని మరో తీపి కబురు కూడా చెప్పేశారు పనిలో పనిగా. ఇక డార్లిగ్ ఫ్యాన్స్ ఊగిపోండక.