కమ్మోళ్లపైనే దాడులు జరుగుతున్నాయ్

వైసీపీ ప్రభుత్వం ఒక సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కమ్మ సామాజికవర్గం నేతలపైనే ఎక్కువ కేసులు [more]

;

Update: 2021-07-31 08:04 GMT

వైసీపీ ప్రభుత్వం ఒక సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కమ్మ సామాజికవర్గం నేతలపైనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. వైసీపీ రాక్షస పాలనకు ఇది అద్దం పడుతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. దేవినేని ఉమను అరెస్ట్ చేయడమే కాకుండా, రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ ను రాత్రికి రాత్రి ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. పరిటాల రవి హత్య కేసులో నిందితులను జైల్లోనే హత్య చేయించారన్న విషయాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు.

Tags:    

Similar News