చంద్రబాబు ఫోన్ .. అయినా బుచ్చయ్య

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా పార్టీలో కలకలం రేపుతుంది. ఆయనతో నేరుగా చంద్రబాబు ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయినా బుచ్చయ్య [more]

;

Update: 2021-08-19 07:08 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా పార్టీలో కలకలం రేపుతుంది. ఆయనతో నేరుగా చంద్రబాబు ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయినా బుచ్చయ్య చౌదరి ససేమిరా అన్నట్లు చెబుతున్నారు. తనకు పార్టీలో సరైన గౌరవం లభించడం లేదని, తాను సూచించిన వ్యక్తులకు కూడా కమిటీల్లో చోటు దక్కకపోవడంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తిగా ఉన్నారు. చంద్రబాబుతో పాటు మరికొందరు కీలక నేతలు కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ఫోన్ లో మాట్లాడి బుజ్జగిస్తున్నారు. తనకు గౌరవం దక్కని, తన మాట చెల్లుబాటు కాని పార్టీలో ఉండటం ఎందుకని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎదురు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నేతగా ఉన్న తన ఫోన్ ను కూడా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లిఫ్ట్ చేయడం లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Tags:    

Similar News