ఇంకో పార్టీలో చేరను
టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా విషయంలో వెనక్కు తగ్గడం లేదు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ఆయన చెబుతున్నారు. తనకు ఇక [more]
;
టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా విషయంలో వెనక్కు తగ్గడం లేదు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ఆయన చెబుతున్నారు. తనకు ఇక [more]
టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా విషయంలో వెనక్కు తగ్గడం లేదు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ఆయన చెబుతున్నారు. తనకు ఇక పెద్దగా ఆశలు లేవని, మరో పార్టీలో తాను చేరడం లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. పార్టీలో తన ఆత్మగౌరవం దెబ్బతినడం వల్లనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. తన 39 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.