Ycp : ఈ ఎంపీని చూశారా…? గన్ మెన్లు అవసరం లేదట
అరకు ఎంపీ గొట్టేటి మాధవి సాధారణ జీవితాన్ని గడుపుతారు. అదే ఆమె కోరుకుంటారు. ఆమె తండ్రి దేముడు సయితం అలాగే ఉండేవారు. కానీ ఈతరానికి చెందిన గొట్టేటి [more]
;
అరకు ఎంపీ గొట్టేటి మాధవి సాధారణ జీవితాన్ని గడుపుతారు. అదే ఆమె కోరుకుంటారు. ఆమె తండ్రి దేముడు సయితం అలాగే ఉండేవారు. కానీ ఈతరానికి చెందిన గొట్టేటి [more]
అరకు ఎంపీ గొట్టేటి మాధవి సాధారణ జీవితాన్ని గడుపుతారు. అదే ఆమె కోరుకుంటారు. ఆమె తండ్రి దేముడు సయితం అలాగే ఉండేవారు. కానీ ఈతరానికి చెందిన గొట్టేటి మాధవి ఇప్పటికీ పొలం పనులకు వెళతారు. తన పని తానే చేసుకుంటారు. కుటుంబంలో గృహిణి జీవితాన్నే గడపటానికి ఇష్పపడతారు. ఇటు ఇంటిని అటు పార్లమెంటు నియోజకవర్గంలో చక్కదిద్దుతూ గొట్టేటి మాధవి రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
గన్ మెన్లు లేకుండానే..?
గన్ మెన్లు లేకుండానే బయటకు వెళతారు. మావోల ప్రాబల్యం ఉన్నప్పటికీ ఆమె ప్రజల్లోకి ఒంటరిగా వెళ్లి కలవడానికే ఇష్పపడతారు. హడావిడిని కోరుకోరు. భర్త సయితం సింపుల్ లైఫ్ నే కోరుకుంటుండటంతో గొట్టేటి మాధవి ఇబ్బంది లేకుండా పోయింది. దసరా రోజు ఆమె ద్విచక్రవాహనంపై కుటుంబ సమేతంగా గుడికి వెళుతున్న ఫొటోలు వైరల్ గా మారాయి. నెటిజన్లు ఆమె సింప్లిసిటీని కొనియాడుతున్నారు.