పవన్ సంచలన నిర్ణయం.. జనవాణి వాయిదా

అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టేంతవరకూ తాను జనవాణి కార్యక్రమానికి వెళ్లనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు

Update: 2022-10-16 05:19 GMT

అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టేంతవరకూ తాను జనవాణి కార్యక్రమానికి వెళ్లనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై తాము కూర్చుని చర్చించుకుంటామన్నారు. శాంతిభద్రతలు కాపాడటానికి తాను సహకరిస్తానని తెలిపారు. పోరాటం మాత్రం ఆగదని ఆయన తెలిపారు. తమ పార్టీ నేతలపై 307 కేసులు పెట్టారన్నారు. జనవాణి విశాఖలో నిర్వహించాలని మూడు నెలల క్రితమే ఖరారయిందన్నారు. తాము పోటీకి ఎందుకు దిగుతామని ఆయన ప్రశ్నించారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే తాము పోటీకి దిగుతామని అన్నారు. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరించారని అన్నారు. తాము ఎక్కడికి వెళ్లాలో వైసీపీ నిర్ణయిస్తుందా? అని ఆయన నిలదీశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తే ఎందుకు తమ వద్దకు ఎందుకు ప్రజలు వస్తారని పవన్ ప్రశ్నించారు. గంజాయి సాగు చేసేవారిని వదిలేస్తున్నారని, దోపిడీ చేసే వారికి నేరగాళ్లకు కొమ్ముకాస్తున్నారని ప్రజల సమస్యలను పట్టించుకునే వారిని మాత్రం అరెస్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు.

దేశ ద్రోహులమా?
జనవాణి కార్యక్రమంలో ఇప్పటి వరకూ మూడు వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. తాము ఇక్కడ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నామా? అని ఆయన ప్రశ్నించారు. తాము ఏమైనా దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నామా? అని పవన్ పోలీసులను ప్రశ్నించారు. తమ కార్యక్రమం అజెండాలో మూడు రాజధానుల అంశమే లేదన్నారు. ఒకే రాజధానిగా ఉండాలన్నది తమ పార్టీ నిర్ణయమని పవన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానులు మారిపోతే ఎలా అని పవన్ ప్రశ్నించారు. రాయలసీమలో అంతమంది ముఖ్యమంత్రులు వచ్చారని ఎందుకు అభివృద్ధి చేయలేదని ఆయన నిలదీశారు. మంత్రులకు అధికారం లేదు కాని, 48 శాఖలు, 28 మంత్రులు ఒక వ్యక్తి చెప్పినట్లు వినాలా? అని ప్రశ్నించారు.
అధికారంలో ఉండి...
అధికారంలో ఉండి గర్జిస్తామంటే ఎలా అని పవన్ నిలదీశారు. పోలీసులు శాంతి భద్రతలను నిర్వహించాలని, విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే వారిపైనే తమ నిరసన ఆయన తెలిపారు. వైసీపీ ఉడుత బెదిరింపులకు తాము భయపడబోమని తెలిపారు. దశాబ్దాల పాటు రాజకీయాలు చేయడం కోసమే తాను వచ్చానని, వైసీపీ గూండాలకు ఒకటే చెబుతున్నానని, ఎలా ఎదుర్కొనాలో తనకు తెలుసునని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిదన్నారు. జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించమని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని పవన్ కల్యాణ‌్ తెలిపారు. వారికి ఘర్షణలు కావాలని, వైసీపీకి ఇది కొత్త కాదని ఆయన అన్నారు. మంత్రులకు పోలీసుల భద్రత ఎందుకు కల్పించలేదన్నారు.


Tags:    

Similar News