టీఆర్ఎస్ ది కేవలం కుటుంబ పాలన అని సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఎన్నికల సభలో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ది ‘అంబాసిడర్ కారు’ గుర్తు అని, అసలు అంబాసిడర్ కారు కాలం ముగిసిందని, మార్కెట్ లోనే లేదని ఎద్దేవా చేశారు. అయినా అంబాసిడర్ కారు గుర్తునే పెట్టుకోవాడానికి కూడా ఓ కారణం ఉందన్నారు. అంబాసిడర్ లో ఐదుగురు మాత్రమే పడతారని, వారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ అని, ఇతరులకు టీఆర్ఎస్ అంబాసిడర్ కారులో చోటు ఉండదన్నారు. కనీసం డిక్కీ లో కూర్చోడానికి కూడా చోటు ఉండదని, డిక్కీ నిండా డబ్బులుంటాయని ఆమె ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరల పేరిట పెద్ద కుంభకోణం చేశారని, బతుకమ్మ చీరలు కవిత కట్టుకుంటారా అని ప్రశ్నించారు.