టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
సలార్ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు, మహిళా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ, ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్, పాన్-ఆధార్‌ను లింక్
నిజంగా కలెక్షన్ల డైనోసార్
ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న భారీగా విడుదలైంది. సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్‌ఈవెన్ మార్క్ కోసం దాదాపు 800 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. సలార్ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.178.7 కోట్ల వసూళ్లు రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు.
ఊహించని పరిణామం.. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్
టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. నారా లోకేష్, కిలారి రాజేష్‌లో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు సమావేశంలో గత కొంతకాలంగా టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ కూడా పాల్గొన్నారు. రాబిన్ శర్మ టీం సర్వేలపై సమావేశంలో చర్చించనున్నారు.
మహిళా ప్రయాణికులకు కీలక సూచన
మహిళా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందని దీంతో ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
గుడ్ న్యూస్: కొత్త రేషన్ కార్డులు కావాలా?
తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం చాలా రోజుల నుండి ఎదురుచూస్తూ ఉన్నారు. ఎన్నో ప్రభుత్వ పథకాలను పొందాలంటే రేషన్ కార్డుల అవసరం ఉండగా.. కొత్త రేషన్ కార్డులు తీసుకోడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఆశతో ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతోంది.
PAN-Aadhaar: పాన్-ఆధార్‌ను ఆలస్యంగా లింక్ చేసిన వారి నుంచి రూ. 2,125 కోట్లు వసూలు
30 జూన్ 2023లోపు ఇచ్చిన చివరి తేదీ తర్వాత కూడా పాన్-ఆధార్‌ను లింక్ చేయడంలో జాప్యం చేసిన వ్యక్తుల నుండి కేంద్ర ప్రభుత్వం రూ. 2,125 కోట్ల పెనాల్టీని వసూలు చేసింది. వీటిలో, ప్రభుత్వం ప్రతి పాన్ కార్డ్ హోల్డర్ నుండి రూ. 1,000 జరిమానా వసూలు చేసిన తర్వాత మాత్రమే పాన్-ఆధార్ లింక్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 2.125 కోట్ల మంది పాన్-ఆధార్‌ను లింక్ చేసారు. అలాగే వారి నుండి ప్రభుత్వం రూ. 2,125 కోట్లను రికవరీ చేసింది
Covid: చలికాలంలోనే కరోనా కేసులు ఎందుకు పెరుగుతాయి? నిపుణులు ఏమంటున్నారు?
Covid19 New Variant JN.1: చైనాలో పెరుగుతున్న న్యుమోనియా కేసులతో శీతాకాలం ప్రారంభం కాగా, ఇప్పుడు భారతదేశంలో కోవిడ్ కేసులు కూడా ఊపందుకున్నాయి. దేశంలో మళ్లీ కోవిడ్ ముప్పు పొంచి ఉంది. ఇది కేరళ నుండి ప్రారంభమైంది. కానీ ఇప్పుడు కోవిడ్ JN.1 కొత్త వేరియంట్ కేరళ ద్వారా దేశంలోని 11 రాష్ట్రాలకు వ్యాపించింది. అలాగే ఈ రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ ఈ కోవిడ్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.
Radish Leaves: ముల్లంగి ఆకులతో అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే..
చాలా మంది ముల్లంగి ఆకులను సాంబార్, కూర వంటి వంటలలో ఉపయోగిస్తారు. అయితే గుర్రపుముల్లంగి ఆకులను చెత్తగా భావించి వాటిని పారేసే వారు చాలా మంది ఉన్నారు. ముల్లంగి ఆకు చెడ్డది కాదని తెలుసుకోండి. ఇందులో పుష్కలంగా పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ ఆకుల్లో విటమిన్ కె, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్, కాల్షియం వంటి పోషకాలు ఉన్నాయి. గుర్రపుముల్లంగి ఆకులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
విడుదలైన ఎన్నారై యశ్
అరెస్ట్ అయిన ఎన్నారై యశ్ విడుదలయ్యారు. 41A నోటీస్ ఇచ్చి విడుదల చేసిన సీఐడీ అధికారులు. తదుపరి విచారణకు రావాల్సి ఉంటుందని తిరుపతి సైబర్ క్రైం విభాగం తెలిపింది. అమెరికా నుంచి వచ్చిన టీడీపీ నేత ఎన్‌ఆర్‌ఐ యశ్ ను ఈరోజు ఉదయం సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో యశ్ ను అదుపులోకి తీసుకుని ... గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు.
చక్రబంధంలో పవన్..?
తెలుగుదేశంతో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ చక్రబంధంలో ఇరుక్కున్నట్లే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే వాట్ నెక్స్ట్ అనే విషయంలో జనసేనకు క్లారిటీ లేదు. పదవుల పంపకాలపై ఎలాంటి హామీలు తెలుగుదేశం నుంచి లేవు. అయినా ఆ పార్టీతో పొత్తును పవన్ ఖాయం చేసేశారు.
కివీస్ మీద బంగ్లాదేశ్ సంచలన విజయం
న్యూజిలాండ్ జట్టు మీద బంగ్లాదేశ్ జట్టు సంచలన విజయం సాధించింది. కివీస్ ను సొంతగడ్డపై 100 పరుగుల లోపు ఆలౌట్ చేసి.. అది కూడా ఛేజ్ చేసి న్యూజి లాండ్ గడ్డపై వన్డేల్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేపియర్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 99 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )