27June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2024-06-27 12:30 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన తొమ్మిది బోగీలు

రష్యాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 70 మంతి ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిపారు. అయితే మరణాలపై మాత్రం ఇంకా స్పష‌్టత రాలేదు. రష‌యాలోని కోమిలోని పాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో తొమ్మిది కోచ్ లు బోల్తాపడ్డాయి. దీంతో 70 మంది గాయాలపాలయ్యారు.

L. K. Advani : ఎల్.కె. అద్వానీకి అస్వస్థత.. ఎయిమ్స్ లో చేరిక

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్‌.కె అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను నిన్న అర్ధరాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అద్వానీ వయసు 96 ఏళ్లు. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలతో ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. అద్వానీని ఎయిమ్స్ లోని వృద్ధాప్య విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

T20 Worla Cup : ఈజీగా ఫైనల్స్ కు చేరిన సౌతాఫ్రికా

టీ 20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా ఫైనల్స్ కు చేరుకుంది. ఆప్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సులువుగా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ జట్టు కేవలం యాభై ఆరు పరుగులు మాత్రమే చేసింది. ఇది పెద్ద లక్ష్యమేమీ కాకపోవడంతో అప్పుడే సౌతాఫ్రికా జట్టు విక్టరీ తేలిపోయింది.

Nitheesh Kumar Reddy : అదృష్టం వచ్చే లోగా బ్యాడ్ లక్ తలుపు తట్టడం అంటే ఇదేనేమో?

నితీష్ కుమార్ రెడ్డి తొలిసారి టీం ఇండియాలో చోటు దక్కిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. నితీష్ జింబాబ్వే పర్యటనకు వెళ్లడం లేదు. అతడి స్థానంలో శివమ్ దూబెను పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. నితీష్ కుమార్ రెడ్డిని జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేసింది.

Breaking : పెద్దిరెడ్డికి ఫస్ట్ షాక్.. మామూలుగా లేదుగా

పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీడీపీ భారీ షాక్ ఇవ్వనుంది. పుంగనూరు మున్సిపాలిటీని తమ పరం చేసుకోనుంది. మున్సిపల్ ఛైర్మన్ భాషాతో పాటు ఇరవై మంది వైసీపీ కౌన్సిలర్లు పుంగనూరు టీడీపీ నేత చల్లాబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. దీంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.

24 గంటలూ ఎంచక్కా షాపింగ్ చేసుకోవచ్చు.. షాపులన్నీ తెరిచే ఉంచేలా ఉత్తర్వులు

దేశంలోని వ్యాపారంలో పోటీతత్వం పెరుగుతున్న వేళ ప్రభుత్వాలు కూడా అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేబర్ రూల్స్ ప్రకారం దుకాణాలు నిర్దేశిత సమయానికి మూసివేయాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆధుని సమాజంలో షాపింగ్ అనేది ఒక ఫ్యాషన్ గా మారింది.

Telangana : మహిళలకు గుడ్ న్యూస్...తులం బంగారం అప్పుడే నట.. సిద్ధం అవుతున్న తెలంగాణ సర్కార్

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వరసగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతుంది. ప్రధానంగా మహిళలను ఆకట్టుకునేందుకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ వెళుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు తెలంగాణ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది.

Volunteers : వాలంటీర్లు ఇక లేనట్లేనా?.. మంగళం పాడేసినట్లే కనిపిస్తుందిగా?

వాలంటీర్లను కొనసాగించాలా? వద్దా? అన్న దానిపై కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే వారిని తప్పించేందుకే ఎక్కువ అవకాశాలున్నట్లు కనిపిస్తుంది. వాలంటీర్ల వ్యవస్థను గత ప్రభుత్వం తీసుకు వచ్చింది. ప్రతి ఇంటికీ పథకాలను తీసుకెళ్లడంతో పాటు అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయడంలో వాలంటీర్లు కీలక భూమిక పోషించారు.

చీఫ్ సెక్రటరీ పదవీకాలం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగించాలని నిర్ణయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ ఏడాది డిసెంబరు నెలాఖరు వరకూ కొనసాగనున్నారు.

Pinnelli : జైలుకు తీసుకెళుతుండగా పిన్నెల్లి ఏం చేశారో తెలుసా?

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపర్చగా పిన్నెల్లికి పథ్నాలుగు రోజులు రిమాండ్ ను న్యాయమూర్తి విధించారు. ఎన్నికల సందర్భంగా పలు కేసులు నమోదు కావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నరసారావుపేటలో అరెస్ట్ చేశారు.



Tags:    

Similar News