28June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
దేశ రాజధాని ఢిల్లీలో ఈదురుగాలులు, భారీ వర్షంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ వన్ లోని పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. శిధిలాల కింద ఒకరు చిక్కుకోవడంతో అతడిని సహాయక సిబ్బంది వెంటనే రక్షించారు. అనేక కార్లపై పైకప్పు భాగాలు పడటంతో అవి దెబ్బతిన్నాయి.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Delhi : ఢిల్లీ విమానాశ్రయంలో కూలిన పై కప్పు
దేశ రాజధాని ఢిల్లీలో ఈదురుగాలులు, భారీ వర్షంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ వన్ లోని పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. శిధిలాల కింద ఒకరు చిక్కుకోవడంతో అతడిని సహాయక సిబ్బంది వెంటనే రక్షించారు. అనేక కార్లపై పైకప్పు భాగాలు పడటంతో అవి దెబ్బతిన్నాయి.
Chandrababu : బీసీలకు యాభై ఏళ్లకే పింఛన్ ఎప్పటి నుంచి అంటే?.. గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు సర్కార్
ఐదేళ్ల విరామం అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతుంది. బాధ్యతలను స్వీకరించిన తొలి రోజే చంద్రబాబు ఐదుఫైళ్లపై సంతకాలు చేశారు. నాలుగు వేల రూపాయలు పింఛను జులై నెల నుంచి అందరికీ మంజూరు చేస్తున్నారు.
T20 World Cup : ఆహా ఏమి భాగ్యము... భారత్ ఫైనల్స్ కు...ఇది కదా ఆశించింది.. కసి తీర్చుకున్న ఇండియా
టీం ఇండియా టీ 20 వరల్డ్ కప్ లో ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించి రారాజుగా ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. 2022లో ఇంగ్లండ్ కొట్టిన దెబ్బకు ఇప్పుడు భారత్ ధాటిగా బదులిచ్చింది. రిటర్న్ గిఫ్ట్ అంటే ఇంగ్లండ్ ప్లేయర్లకు రుచి చూపించింది టీం ఇండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించి నీటుగా..
Water Project : నైరుతి వచ్చిందన్న మాటకానే.. నీరు ఏదీ.. నాట్లు వేసేది ఎలా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికి ముందే రాష్ట్రాలలోకి ప్రవేశించినప్పటికీ వర్షాలు సమృద్ధిగా పడటం లేదు. జూన్, జులై నెలలో కూడా ఇలాగే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Delhi : ఢిల్లీలో దంచి కొడుతున్న వర్షాలు... అవస్థలు పడుతున్న జనాలు
దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి అధిక వర్షపాతం నమోదవుతుంది. నిన్న మొన్నటి వరకూ ఎండలతో ఢిల్లీ వాసులు ఇబ్బంది పడ్డారు. ఎండ వేడిమిని తట్టుకోలేక అల్లాడి పోయారు. అనేక మంది వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలయ్యారు. కొందరు మరణించారు కూడా.
పాపికొండల విహారయాత్ర నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ లో తుఫాను హెచ్చరిక జారీ చేయడంతో పాటు గోదావరి నదిలో నీటి ఉధృతి పెరగడంతో పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల పాటు యాత్రను నిలిపివేస్తున్నామని అధికారులు తెలిపారు.
Andhra Pradesh : పేదోడికి గుడ్ న్యూస్.. రెడీ కానున్న అన్న కాంటిన్లు
అన్న క్యాంటీన్ లు పునరుద్ధరణకు కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే అన్నా కాంటిన్ల పునరుద్ధరణ ఫైలుపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. త్వరితగతిన అన్నా కాంటిన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఢిల్లీలో ఒవైసీ ఇంటిపై మరోసారి దాడి
హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై మరోసారి దాడి జరిగింది. ఢిల్లీలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు నల్లఇంకుతో దాడికి దిగారు. ఇటీవల పార్లమెంటులో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ జై పాలస్తీనా అనడమే ఇందుకు కారణమని తెలుస్తుంది.
Bihar : పది రోజుల్లో నాలుగో వంతెన కూలింది.. బీహార్ లో ఇదేంది సామీ
బీహార్ లో వరసగా వంతెనలు కూలుతున్నాయి. మరో వంతెన కూలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో బీహార్ లో కూలిన నాలగో వంతెన ఇది. బీహార్ లోని కిషన్ గంజ్ లో మళ్లీ మరో వంతెన కూలిపోయింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే బీహార్ లో నాలుగో వంతెన కూలిపోవడంతో వంతెన నిర్మాణాలపై పలు రకాల అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
మెదక్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపాస్ రోడ్డు పై ముందు వెళుతున్న లారీని వెనక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.