నాతో పెట్టుకోకు.. నల్లపురెడ్డి ఆయనకు వార్నింగ్

నెల్లూరు జిల్లా వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ జిల్లా ఎస్పీకి వార్నింగ్ ఇచ్చారు. నాతో పెట్టుకుంటే ఇక్కడ ఉండలేవు అని ఫైర్ అయ్యారు. [more]

Update: 2021-01-18 07:43 GMT

నెల్లూరు జిల్లా వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ జిల్లా ఎస్పీకి వార్నింగ్ ఇచ్చారు. నాతో పెట్టుకుంటే ఇక్కడ ఉండలేవు అని ఫైర్ అయ్యారు. రెండునెలలు, మూడు నెలలు ఉంటావో తెలియదు కాని ఉన్న రోజులు మంచిగా ఉండమని చెప్పారు. తమాషాలు పడొద్దని చెప్పారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కేసును తెలుగుదేశం పార్టీ నేతలు రిజిస్టర్ చేయవద్దని చెబితే ఎస్పీ ఎలా కిందిస్థాయి అధికారులకు ఆదేశాలిస్తారని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ మాజీ మంత్రి చెబితే నువ్వు వింటావా? ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో తెలుసా? అని నిలదీశారు. మా ఖర్మ కొద్దీ ఇక్కడకు ఎస్పీగా వచ్చాడని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News