ఆందోళ‌న వ‌ద్దు.. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే విలీనం

ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, మంచి రోజులు వ‌స్తున్నాయ‌ని, జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విల‌నీం చేస్తార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ [more]

Update: 2019-05-11 07:23 GMT

ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, మంచి రోజులు వ‌స్తున్నాయ‌ని, జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విల‌నీం చేస్తార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థ‌సార‌థి పేర్కొన్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఆర్టీసీ అస్థిత్వం డోలాయ‌మానంలో ప‌డింద‌ని, ఆర్టీసీకి టీడీపీ ప్ర‌భుత్వం అన్యాయం చేసింద‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు నిర్వాకం వ‌ల్లే ఈ దుస్థితి ఏర్ప‌డింద‌న్నారు. ఆర్టీసీపై చంద్ర‌బాబు, ఆయ‌న అనుచ‌రుల క‌న్ను ప‌డింద‌ని, అందుకే ఆర్టీసీకి కబళించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఏపీలో ఆర్టీసీపై ప‌న్నుభారం మోపార‌ని అన్నారు. ఆర్టీసిని న‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు చంద్ర‌బాబు ఒక్క ప్ర‌య‌త్నం అయినా చేశారా అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ఆదుకుంటార‌ని, కార్మికులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కోరారు.

Tags:    

Similar News