Tirumala : తిరుమలలో ఏ మాత్రం తగ్గని రద్దీ .. నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గురువారం అయినా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది

Update: 2024-12-19 02:13 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గురువారం అయినా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటుండటంతో టీటీడీ అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సోమవారం నుంచి భక్తుల రద్దీ తిరుమలకు ఒక్కసారిగా పెరిగింది. ధనుర్మాసం ప్రారంభమయిన నాటి నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల అంచనాలకు తగినట్లుగానే భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం కూడా ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి కళకళలాడిపోతున్నాయి. తిరుమల వీధులన్నీ గోవింద నామ స్మరణలతో మారు మోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ప్రధానంగా అయ్యప్ప సీజన్ కావడంతో స్వాములు శబరిమల దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వచ్చే సమయంలో తిరుమలను ఖచ్చితంగా దర్శించుకుంటున్నందున అయ్యప్పస్వాములకు చెందిన బస్సులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. మండల పూజకు వెళ్లిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతుందని, స్వాములు కూడా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారని అంటున్నారు.

పదిహేను కంపార్ట్ మెంట్లలో...
తిరుమల సాధారణంగా ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం మొక్కులు చెల్లించుకోవడమే కాకుండా, తిరుమల కొండపై ఒకరోజు నిద్రిస్తే పుణ్యం లభిస్తుందని భావించడంతో రద్దీ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. గతంలో వేసవి కాలంలో నే ఎక్కువ రద్దీ ఉండేది. కానీ ఇప్పుడు సీజన్ తో సంబంధం లేకుండా రద్దీ ఏర్పడుతుంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదహారు కంపార్ట్ మెంట్లలో భక్తుల శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలుచేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,457 మంది దర్శించుకున్నారు. వీరిలో 22,152 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.16 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News