రేవంత్ రెడ్డి కేసులో హైకోర్టు అక్షింతలు

Update: 2018-12-05 09:36 GMT

తెలంగాణ పోలీసుల వైఖరిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో ఇవాళ డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. అయితే, హైకోర్టుకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టుకు సీల్ ఎందుకు లేదని కోర్టు ప్రశ్నించింది. సీల్ లేకుండా రిపోర్ట్ ఇస్తే పోలీసుల అధికారాలు దుర్వినియోగం కాలేదనడానికి ఆధారం ఏంటని ప్రశ్నించింది. తమవద్ద సీల్ ప్రాసెస్ లేదని డీజీపీ చెప్పగా... మీ పోలీసులు ఇలానే పని చేస్తారా ? అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి పేపర్ రిపోర్టులు ఎవరైనా ఎక్కడైనా తయారు చేయవచ్చు కదా అని పేర్కొంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గొడవ చేస్తాడు అనే సమాచారం ఉంటే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి గానీ ఎలాంటి వారంట్ లేకుండా అర్థరాత్రి ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించింది. ఈ కేసును 17వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Similar News