139 మంది రేప్ కేసులో సంచలన విషయాలు
పంజాగుట్ట రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 139 మంది తనపై అత్యాచారం చేశారంటూ మహిళ ఫిర్యాదు ఇచ్చింది. ఈ ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు కేసు [more]
పంజాగుట్ట రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 139 మంది తనపై అత్యాచారం చేశారంటూ మహిళ ఫిర్యాదు ఇచ్చింది. ఈ ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు కేసు [more]
పంజాగుట్ట రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 139 మంది తనపై అత్యాచారం చేశారంటూ మహిళ ఫిర్యాదు ఇచ్చింది. ఈ ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అమ్మాయిని ఎక్కడెక్కడ ఏయే ప్రాంతాల్లో బలత్కారం చేశారు. అనేదానిపై పోలీసులు దృష్టిపెట్టారు. మొదటిసారి ఎక్కడ అన్యాయానికి గురి అయిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. బాధిత మహిళ పదో తరగతి పాస్ కాగానే కుటుంబ సభ్యులు వివాహం చేశారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ కిచెందిన యువకుడితో మహిళ వివాహం చేసుకుని వచ్చింది. అయితే అక్కడే మొదటిసారి అత్యాచారానికి గురయింది .భర్తతో కాపురం చేస్తున్న సమయంలో మామ బాధిత మహిళ పై అత్యాచారం చేశాడు. అయితే ఈ విషయాన్ని భర్తకు చెబితే పట్టించుకోలేదు. ఆ తర్వాత భర్త సోదరులు కూడా బాధ్యత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.
విద్యార్థి సంఘం నేతతో పరిచయంతో…
దీంతో పాటుగా మరో ఇద్దరు కూడా మహిళ పైన అత్యాచారం చేశారు. వీళ్ళ అఘాయిత్యాలను భరించలేక మహిళల విడాకులు తీసుకుంది. తిరిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ చదువుకుంటున్న సమయంలో సుమన్ అనే విద్యార్థి సంఘం నాయకుడు తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో సుమన్ తో పాటు బాధిత మహిళ హైదరాబాద్ కు రావడం జరిగింది. అయితే ఇక్కడికి చేరుకున్న తర్వాత మహిళ పైన ప్రతి నిత్యం అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి బాధిత మహిళ ను నమ్మించి సుమన్ దేశం మొత్తం తిప్పాడు. ఢిల్లీ ,ముంబై బెంగళూరు, చెన్నై, కలకత్తా నాగపూర్ , పూణే లాంటి ప్రదేశాలకు తీసుకు వెళ్ళాడు. అక్కడ తన ఫ్రెండ్స్ తో బాధిత మహిళ పైన రేప్ చేయించాడు. కొన్ని సందర్భాల్లో కత్తి మెడ మీద పెట్టి రేప్ చేశారు. మరి కొన్ని సమయాల్లో బాధిత మహిళ తో సెక్స్ చేస్తున్న సమయంలో వీడియో తీశారు. ఫోటోలు తీశారు. ఇలా దేశవ్యాప్తంగా మహిళను తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే దీని వెనకాల సుమన్ ఉండటంతో ప్రస్తుతానికి అతని కోసం అధికారులు గాలిస్తున్నారు.
సినీ ఇండ్రస్ట్రీ నుంచి కూడా….
2011 నుంచి ఇప్పటివరకు 139 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పంజాగుట్ట పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. కొన్ని సందర్భాల్లో తనపై గ్యాంగ్ రేప్ లు కూడా జరిగాయని పేర్కొంది. మరోవైపు కొన్ని సందర్భాల్లో వీడియోలు చూసి ఫొటోలు తీసి వేధింపులకు పాల్పడ్డారని చెప్పింది. అయితే వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన 139 మంది రేప్ చేశారనే విషయం ఇపుడు సమగ్ర దర్యాప్తు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అత్యాచారానికి గురైన మహిళ కొన్నాళ్లపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పని చేసింది. పలు టీవీ సీరియల్ తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఈ నేపథ్యంలో పలువురు సినిమా నటులు తో పాటు టీవీ ఆర్టిస్టులతో కూడా బాధిత మహిళకు పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాల తోనే బాధిత మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరెవరు ఎక్కడ తనపై అత్యాచారం చేశారని విషయాన్ని సమగ్ర సమాచారం తో పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.