పని ప్రారంభించిన కాబోయే సీఎం జగన్
ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అప్పుడే పరిపాలనపై కసరత్తు ప్రారంభించారు. నిన్న ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయనను [more]
;
ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అప్పుడే పరిపాలనపై కసరత్తు ప్రారంభించారు. నిన్న ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయనను [more]
ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అప్పుడే పరిపాలనపై కసరత్తు ప్రారంభించారు. నిన్న ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయనను ఇవాళ వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు కలిశారు. వారి శాఖల గురించి ఆయన వారితో చర్చిస్తున్నారు. ప్రమాణస్వీకారం చేశాక తీసుకోవాల్సిన చర్యలపై ఆయన మాట్లాడుతున్నారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ను కలిసిన వారిలో ఐఏఎస్ లు జయశ్రీ ప్రసాద్, సాంబశివరావు, సతీష్ చంద్ర, కరికల వలవన్, అహ్మద్ బాబు, కన్నబాబు, రవిచంద్ర, సత్యనారాయణ, సంధ్యారాణి, అజయ్ జైన్, గిరిజాశంకర్, రాజమౌళి తదితరులు ఉన్నారు.