అన్నీ అనుకున్నట్లు జరిగితే… జగన్ ప్లాన్ ఇదే

ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా ఉండటంతో విజయంపై మరింత ధీమాగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే [more]

;

Update: 2019-05-21 13:14 GMT

ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా ఉండటంతో విజయంపై మరింత ధీమాగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కల్పించారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి సూచనలు చేశారు. ఎల్లుండి ఉదయం 6 గంటల వరకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, ఫలితాలు వచ్చాక ఆర్వో నుంచి ధృవీకరణ పత్రం తీసుకున్నాకే బయటకు రావాలని పార్టీ సూచించింది. ఇక, వైసీపీ అధినేత జగన్ రేపు అమరావతి చేరుకోనున్నారు. తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయం నుంచే ఆయన ఎల్లుండి ఫలితాలను పర్యవేక్షించనున్నారు. 12 గంటల వరకు ఫలితాల సరళి తెలియనున్నందున ఆయన 12.30 గంటలకు మీడియాతో మాట్లాడేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే రోజు సాయంత్రం జగన్ గెలిచిన ఎమ్మెల్యేలతో అమరావతిలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News